హైదరాబాద్ కు తరలివచ్చిన సెర్ప్ ఉద్యోగులు..ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని మంత్రులకు వినతి

0
33

అసెంబ్లీలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన హామీ ప్రకారం రెగ్యులరైజేషన్ ప్రకటించకపోవడం నిరాశ చెందిన సెర్ప్ ఉద్యోగులు గురువారం పెద్ద సంఖ్యలో హైదరాబాద్ తరలివచ్చారు. భారీ సంఖ్యలో ఉద్యోగులు వచ్చి రెండు టీములుగా విడిపోయి ఇద్దరు మంత్రులైన ఎర్రబెల్లి దయాకర్ రావుకు, మంత్రి హరీష్ రావును కలిసి డిమాండ్ చేశారు.

మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి ఎర్రబెల్లిని దాదాపు 300 మంది  కలిసారు. మేనిఫెస్టో లో మరియు యు.ఎస్ సభల తొలి సమావేశం గవర్నర్ ప్రసంగంలో చేర్చిన ప్రకారం తూర్పు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేపట్టాల్సి ఉన్నప్పటికీ నిన్న ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలో ఉద్యోగుల ప్రస్తావన లేకపోవడం పట్ల మనస్తాపం చెంది ఈ రోజు భారీ సంఖ్యలో ఉద్యోగులు హైదరాబాద్ కు తరలివచ్చారు.

తన క్యాంపు కార్యాలయానికి పెద్ద సంఖ్యలో విచ్చేసిన ఉద్యోగులతో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. చట్టపరమైన అడ్డంకులు లేకుండా రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి మరికొంత సమయం తీసుకుంటున్నారని..ఇచ్చిన మాట ప్రకారం న్యాయం చేస్తారని సహనంతో ఉండాలని ఉద్యోగులకు సూచించారు. 22 సంవత్సరాలుగా కాంట్రాక్టు ఉద్యోగులుగా బ్రతుకు వెళ్లదీస్తున్న మని ఇంకా 10 నుంచి 15 సంవత్సరాల సర్వీస్ మాత్రమే ఉందని ఇప్పటికైనా కరుణించి ఇచ్చిన మాట ప్రకారం రెగ్యులర్ చేయాలని మంత్రి కోరారు.

మరోపక్క ఉద్యోగుల మరో బృందం ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుని కలిశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణతో పాటే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం తీర్పు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కూడా చేపట్టాలని హరీష్ రావు కు విన్నవించారు. అలాగే ఎమ్మెల్సీ కవితను ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి రెగ్యులరైజేషన్ కు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని అధికారిక అడ్డంకులను తొలగించేందుకు సహకరించాలని కోరారు. ఈ అంశంపై స్పందించిన ఎమ్మెల్యే కవిత అధికారిక అడ్డంకులు లేకుండా ముఖ్యమంత్రితో మాట్లాడతానని తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నట్లు నాయకులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా మినిస్టర్ క్వార్టర్స్ లో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ఈ బృందం కలిసి నిన్నటి ఘటనలో ఉద్యోగుల ప్రస్తావన లేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. స్పందించిన మంత్రి గారు తన వంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో SERP ఉద్యోగ సంఘాల స్టేట్ జేఏసీ నాయకులు కుంట గంగాధర్ రెడ్డి నరసయ్య మహేందర్ రెడ్డి, సుదర్శన్, సుభాష్, సురేఖ వెంకట్, గిరి, జానయ్య, గడ్డి అశోక్, మధు,రాజారెడ్డి, బాలరాజు 33 జిల్లాల SERP సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.