‘RRR’ సినిమాకు గుడ్ న్యూస్..సినిమా టికెట్ల పెంపుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

0
113

థియేటర్లలో టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ సర్కార్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు నాలుగు ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కేసులు పెరగడంతో సినిమాను వాయిదా వేశారు మేకర్స్.ఇది ఇలా ఉండగా ఈ నెల 25వ తేదీన విడుద‌ల కాబోతున్నట్టు తెలిపారు చిత్ర యూనిట్. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగ ఈ సినిమా విడుద‌లకు ముందు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్ఆర్ఆర్ సినిమా టిక్కెట్ ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది. దీంతో ఈ సినిమా టిక్కెట్ ధ‌ర రూ. 100 వ‌ర‌కు పెరిగే అవ‌కాశం ఉంది.

ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో ఆర్ఆర్ఆర్ సినిమా క‌లెక్షన్లు మ‌రింత పెర‌గ‌డానికి అవ‌కాశం ఉంది. అంతే కాకుండా ఆర్ఆర్ఆర్ సినిమాకు బెనిఫిట్ షోలను ప్ర‌ద‌ర్శించ‌డానికి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం సంతోషం వ్య‌క్తం చేస్తుంది.