మీ ఫోన్ హ్యాంగ్ అవుతుందా? అయితే ఇలా చేయండి

0
42

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్స్ ని వారని వారుండరు. చాలా మంది ఫోన్ హ్యాంగ్ అయిపోతుందని చెప్పడం మీరు వినే ఉంటారు. అయితే ఎక్కువ ఫోటోలు, వీడియోలు లాంటివి ఉండడం వల్ల ఫోన్ యొక్క స్పీడ్ తగ్గిపోతుంది. ఎక్కువ యాప్స్ ని వాడటం వల్ల కానీ,ఇష్టానుసారంగా ఫోన్ ని ఉపయోగించినప్పుడు కానీ స్లో అయిపోతూ ఉంటుంది.

స్మార్ట్ ఫోన్స్ ని అధికంగా ఉపయోగించడం వల్ల స్లో అయిపోతూ ఉంటుంది. దీంతో వేగంగా ఫోన్ రెస్పాండ్ అవ్వదు. మనకి చికాకు కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఈ చిట్కాలు పాటిస్తే ఖచ్చితంగా మీ ఫోన్ మళ్ళీ స్పీడ్ అవుతుంది. అంతే కాకుండా మీ ఫోన్ బాగా పని చేస్తుంది అలానే హ్యాంగ్ అవకుండా ఉంటుంది.

దీని కోసం మొదట మీరు సెట్టింగ్స్ ని ఓపెన్ చేయండి.అందులో అబౌట్ ఓపెన్ చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ అయిందో లేదో చూడండి.సాఫ్ట్వేర్ అప్డేట్ చెయ్యి లేకపోతే అప్డేట్ చేయండి. అప్డేట్ చేయడానికి పదిహేను నిమిషాల వరకూ పట్టొచ్చు.తరువాత  మీరు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఏదైనా ఆప్స్ అప్డేట్ చేయలేమో చూడండి.

యానిమేషన్స్ ఉంటే ఫోన్ స్లో అవుతుంది. పాత స్మార్ట్ ఫోన్స్ లో యానిమేషన్ సరిగా పనిచేయవు.
కాబట్టి సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఎబౌట్ పైన క్లిక్ చేయండి.బిల్డ్ నెంబర్ పైన ఏడుసార్లు క్లిక్ చేయండి.అప్పుడు డెవలపర్ డెవలపర్ మోడ్ ఎనేబుల్ అవుతుంది.యానిమేషన్ కనబడితే అక్కడ మీరు దానిని ఆఫ్ చేయండి.

అలానే స్మార్ట్ ఫోన్ సెట్టింగ్స్ లో స్టోరేజ్ పైన క్లిక్ చేసి యాప్స్ పైన క్లిక్ చేయండి. అవసరం లేని వాటిని డిలీట్ చేయండి. లేదంటే మీరు కంప్యూటర్ లో బ్యాకప్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఫోన్ స్పీడ్గా పని చేస్తుంది.ఈ చిట్కాలు ప్రయత్నించి మీ ఫోన్  స్పీడ్ పెంచుకోండి..