బెల్లం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..

0
96

బెల్లం అంటే చాలా మందికి ఇష్టం. బెల్లంతో చేసిన వంటకాలనే కాదు, ఉత్తి బెల్లాన్ని కొరుక్కుని తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ఉద్దేశంతో చాలామంది దీన్ని రోజుకు రెండు మూడుసార్లు తింటుంటారు. మరి, రోజూ బెల్లం తినడం ఆరోగ్యానికి మంచిదేనా? దీని వల్ల శరీరానికి జరిగే మేలు ఏమిటీ? ఇప్పుడు తెలుసుకుందాం..

బెల్లంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వైద్యులు సైతం కొంతమంది పేషెంట్లకు షుగర్‌ కు బదులు బెల్లం తీసుకోమని చెబుతుంటారు. బెల్లంతో ఆరోగ్యానికి ఎటువంటి హానీ లేకపోగా..అందులోని ఔషధ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఐరన్, జింక్‌ కారణంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలచెక్ పెట్టొచ్చు. ఇంకా దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

బెల్లం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

చెక్కెరకు బదులుగా బెల్లం ఉపయోగిస్తే.. చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బెల్లంను ఆయుర్వేద చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. దీంతో హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వారు బెల్లం తినాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు బెల్లం ఎక్కువగా తింటే.. ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే.. ఇంత మేలు చేసే బెల్లాన్ని ప్రతి రోజు ఉదయాన్నే తింటే ఇంకా ఎంతో మంచిది. రోజూ 50 గ్రాముల బెల్లం తీసుకుంటే ఎంతో మంచిదని.. చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు.

ఉదర సమస్యలను తొలగించడంలో బెల్లం సహకరిస్తుంది. బెల్లం నిత్యం తినడం వల్ల కడుపు నొప్పి సమస్యలు, జీర్ణ సమస్యలు, ఎసిడిటీ, గ్యాస్ లాంటి వాటికి చెక్ పెట్టొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. బెల్లం తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. ఉదయం వేళ అల్లం, బెల్లం కలిపి తీసుకున్నా మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ∙ఎముకలు దృఢంగా మారుతాయి. బెల్లంలో క్యాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల్ని దృఢంగా చేయడంలో సాయపడతాయి.

దీంతోపాటు చెక్కర ఉపయోగించకుండా.. బెల్లంను ఉపయోగించడం వల్ల రక్త, షుగర్ సంబంధిత అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చక్కెరకు బెల్లం ప్రత్యామ్నాయం. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. బరువు పెరగడాన్ని, ఊబకాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బెల్లం తీసుకోవడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నవారు బెల్లం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కావున ప్రతీరోజూ ఉదయాన్నే ఎంతోకొంత బెల్లం తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.