ఆ కులస్థులకు ఏపీ సర్కార్ శుభవార్త

0
81

ప్రస్తుతం ఏపీ సర్కార్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ మాట్లాడారు. దేవాలయాల్లో అన్ని కులాలకు అన్నదాన సత్రాలు ఉన్నాయని పేర్కొన్నారు.

కానీ మాదిగలకు మాత్రం అన్నదాన సత్రాలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలంలో మాదిగ కులానికి అన్నదాన సత్రాలు ఏర్పాటుకు స్ధలం కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అయితే.. డొక్కా మాణిక్య వర ప్రసాద్ వ్యాఖ్యలకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ స్పందించారు. శ్రీశైలంలో మాదిగలకు అన్నదాన సత్రం ఏర్పాటుకు అవసరమైన స్ధలాన్ని కేటాయిస్తామని.. శ్రీశైలమేకాకుండా.. అన్ని దేవాలయాల్లో సత్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటన చేశారు.

సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా ఈ విషయమై సానుకూలంగా స్పందించారన్నారు. టీడీపీ హయాం నుంచి మాదిగలకు అన్నదాన సత్రానికి స్ధలం కేటాయించాలని డొక్కా మాణిక్య వర ప్రసాద్ నాటి ప్రభుత్వాన్ని కోరారని.. చంద్రబాబు ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.