నీరు ఎక్కువ తాగుతున్నారా? అయితే సమస్యలు తప్పవు

0
34

నీరు శరీరానికి ఎంత అవసరమో అందరికి తెలుసు. ఆహారం లేకపోయినా కొద్ది రోజులు ఉండగలం. కానీ నీరు లేకపోతే బ్రతకడం కష్టం. అందం, ఆరోగ్యానికి మంచి నీరే రహస్యమని చాలా మంది చెబుతుంటారు. ఐతే నీరు మరీ ఎక్కువగా తాగితే చాలా డేంజర్ అంట? ఒక రోజులో అధిక మొత్తంలో నీటిని తాగితే కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందట. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

మామూలుగా రోజూ కనీసం 2-3 లీటర్ల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఐతే కొందరు మాత్రం రోజులో 5-6 లీటర్ల నీరు త్రాగుతారు. మొటిమలు, చర్మం పొడిబారడం, ముఖంపై ముడతలు వంటి చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి ఎక్కువ నీరు తాగుతారు. ఐతే అలా ఎక్కువ నీరు తాగడం మంచిది కాదు.  ఒక వ్యక్తి ఒక రోజులో శరీర అవసరాల కంటే ఎక్కువ నీరు తాగితే.. అప్పుడు హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా శరీరానికి రోజుకు 2 లీటర్ల నీరు అవసరం. గరిష్టంగా 3 లీటర్ల వరకు నీటిని త్రాగవచ్చు. మీరు ఇంతకు మించి తాగితే.. వాటర్ ఇన్‌టాక్సికేషన్ (నీటి మత్తు) సంభవింవచవచ్చు. నీటి మత్తు అనేది నీరు ఎక్కువగా తాగడం వల్ల ఏర్పడే పరిస్థితి. దీనివల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చెదిరిపోతుంది. ఎక్కువ నీరు త్రాగడం ద్వారా రక్తంలో సోడియం ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంటుంది. ఇది కొన్నిసార్లు తేలికపాటి లక్షణాలకు .. తీవ్రమైన పరిస్థితుల్లో ప్రాణాల ముప్పునకు కూడా దారితీస్తుంది.

మెదడు కణాలలో వాపు ఉంటే. ఆ వ్యక్తికి గందరగోళం, మత్తుగా అనిపించడం, తిమ్మిరి, కండరాల బలహీనత, అధిక రక్తపోటు మొదలైనవి కనిపిస్తాయి. ఒక వ్యక్తి 10 లీటర్ల నీరు తాగితే, రక్తంలో సోడియం స్థాయి మరింత తగ్గుతుంది. ఇది మెదడుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఒక వ్యక్తి కోమాలోకి వెళ్లడానికి, మరణానికి కూడా దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.