తమిళనాడు సీఎం స్టాలిన్ ఎప్పటికప్పుడు వినూత్నమైన పథకాలతో తన మార్క్ పాలన చేస్తుంటారు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు సీఎం స్టాలిన్. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ స్కూళ్లు, కళాశాలల్లో చదువుకునే బాలికలకు నెలకు రూ.1000 ఇస్తామని ప్రకటించింది. తమిళనాడు బడ్జెట్ లో ఆర్థిక మంత్రి పీటీఆర్ పళనివేల్ త్యాగరాజన్ ఈపథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా తమిళనాడులో 6 లక్షల మంది విద్యార్థినులు లాభం పొందుతారని పేర్కొంది.