తెలంగాణ కాంగ్రెస్ లో నేతల అసమ్మతి మరోమారు బయటపడింది. ఇప్పటికే ఎడమొహం పెడముహం ఉంటున్న రేవంత్ రెడ్డిపై, జగ్గారెడ్డి బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. పీసీసీ వర్సెస్ కాంగ్రెస్ సీనియర్లు అన్న రేంజ్ లో ఫైటింగ్ సాగుతోంది. అటు కోమటిరెడ్డి బ్రదర్స్, ఇటు జగ్గారెడ్డి వ్యవహారం హైకమాండ్ కు తలనొప్పిగా మారింది.
తాజాగా నేడు కాంగ్రెస్ సీనియర్లు సమావేశం అయ్యారు. ఈ సమావేశం అనంతరం జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా.. రేవంత్ రెడ్డి తనపై అభ్యర్థిని నిలబెట్టి గెలిపించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ లో రేవంత్ భజన పెరిగిపోయిందన్న జగ్గారెడ్డి తమను పార్టీ నుండి సస్పెండ్ చేసే హక్కు వాళ్లకు లేదన్నారు.
వీహెచ్ ఆయన కూతురు కోసం వెళ్లి మంత్రి హరీష్ రావును కలిశారని.. దీంట్లో తప్పేంటని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అల్టిమేట్ నిర్ణయం సోనియా గాంధీ, రాహుల్ గాంధీనే అని అన్నారు. రేవంత్ రెడ్డి పార్టీని చెడగొడతాడని పార్టీ కొంపముంచుతాడని ఆయన అన్నారు.