ఆధార్ కార్డుపై మీ ఫోటో నచ్చలేదా? మరి ఈజీగా మార్చుకోండిలా..

Didn't like your photo on Aadhaar card? Make it easy ..

0
29

ప్రస్తుతం ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి తప్పనిసరి అయింది. ప్రభుత్వ పథకాలకు, సిమ్‌ కార్డులు, బ్యాంకుల్లో ఖాతా తెరవడం, పింఛను.. ఇలా ప్రతిదానికీ ఆధార్‌ కార్డు ఉండాల్సిందే. అయితే ఆధార్ లో కొన్ని తప్పులను మార్చుకోవాలనుకుంటాం. అలాగే ఆధార్ లోని ఫోటో మనకు నచ్చదు. మరి అలాంటపుడు దాన్ని మార్చుకోవాలని అనిపిస్తుంటది. కానీ ఫోటో మార్చుకోవడం ఎలాగో తెలియక చాలా మంది అలాగే ఉండిపోతారు. అయితే ఆధార్ లో ఉన్న ఫోటోను మార్చేందుకు ఓ మార్గం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

యూఐడీఏఐ (UIDAI) వెబ్‌సైట్‌ (https://uidai.gov.in/) నుంచి ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌/కరెక్షన్‌/అప్‌డేట్‌ ఫారంను డౌన్‌లోడ్‌ చేసుకొని సరైన వివరాలతో పూరించాలి.

దగ్గర్లోని ఆధార్‌ నమోదు కేంద్రానికి వెళ్లి ఫారంను సమర్పించాలి.

అక్కడ వారు కొత్త ఫొటోను తీసుకుంటారు.

మీ బయోమెట్రిక్‌తో వివరాలను ధ్రువపరుస్తారు.

రూ.100+ జీఎస్టీ చెల్లించాలి.

అక్‌నాలెడ్జ్‌మెంట్‌ స్లిప్‌తో పాటు అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నంబర్‌(URN)ను తీసుకోవాలి.

యూఆర్‌ఎన్‌తో కొన్ని రోజుల తర్వాత మీ అప్‌డేట్‌ స్థితిని తెలుసుకోవచ్చు.

ముఖ్య గమనిక:

కొత్త ఫొటోతో మీ ఆధార్‌ అప్‌డేట్‌ కావడానికి గరిష్ఠంగా 90రోజుల వరకు పట్టొచ్చు. అలాగే ఫొటో అప్‌డేట్‌ చేయడానికి ఎలాంటి అదనపు పత్రాలు సమర్పించాల్సిన అసవరం ఉండదు.

డౌన్ లోడ్ ఇలా..

UIDAI అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘డౌన్‌లోడ్‌ ఆధార్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

ఆధార్‌ నంబర్‌/ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ/ వర్చువల్‌ ఐడీ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి.

ఆధార్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు అక్కడ ఉన్న క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేయాలి.

ఆ తర్వాత సెండ్‌ ఓటీపీ బటన్‌పై క్లిక్‌ చేసి.. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయాలి. తర్వాత డౌన్‌లోడ్‌పై క్లిక్‌ చేయాలి.

ఆ తర్వాత మీకు పీడీఎఫ్‌ రూపంలో ఆధార్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. దీనికి పాస్‌వర్డ్‌ ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు ఈ-మెయిల్‌ ద్వారా వస్తాయి.

లేదా దగ్గర్లోని ఆధార్‌ నమోదు కేంద్రానికి వెళ్లి యూఆర్‌ఎన్‌ సహా ఇతర వివరాలు చెప్పి కూడా ఆధార్‌కార్డు తీసుకోవచ్చు.