మనం ఎంత అందంగా ఉన్నా సరే పళ్లు తెల్లగా లేకపోతే మనసారా ఎవరితోనూ మాట్లాడలేం. కనీసం నలుగురిలో కలిసి నవ్వలేము. ప్రస్తుత కాలంలో ఎంతో మంది పసుపు పచ్చ పళ్లతో బాధపడుతున్నారు. రోజుకు రెండు మూడు సార్లు బ్రష్ చేసినా పళ్లు మాత్రం తెల్లబడవు. మరి దీనికి కారణమేంటి? పళ్లు తెల్లగా మెరవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం..
కారణం:
పళ్లు పసుపు పచ్చగా మారేందుకు ఎన్నో కారణాలు ఉండొచ్చు. బ్రష్ చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పొగ తాగడం, వాతావరణ మార్పులు, కూల్ డ్రింక్స్ తాగడం, మెడిసిన్స్ తీసుకోవడం వల్ల పళ్లు తమ సహజ రంగును కోల్పోతాయి. మరోవైపు గ్రామాల్లో ఇప్పటికీ చాలా మంది బొగ్గుతో పళ్లు తోముతారు. పళ్లపై ఉండే బ్యాక్టీరియా, ఇతర మలినాలనుబ బొగ్గు తొలగిస్తుంది. అందుకే అప్పుడప్పుడే బొగ్గు పొడితో పళ్లు తోముకుంటే మరకలు పోతాయి. పాచి కూడా పట్టదు
చిట్కాలు ఫాలో అయితే..
పళ్లపై మరకలు పోగట్టడంలో యాపిల్ సిడర్ వెనిగర్ బాగా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూర్ల యాపిల్ సిడర్ వెనిగర్‌ని కప్పు నీళ్లలో పోసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంతో నోటిని ఒకటి రెండు సార్లు పుక్కిలించాలి.
ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను నోట్లో పోసి పుక్కిలించాలి. నూనెను మింగకూడదు. 10 నిమిషాల పాటు అటూ ఇటూ బాగా పుక్కించాలి. ఆ తర్వాత నూనె ఉమ్మివేసి.. మంచి నీటితో నోటిని కడుక్కోవాలి. అనంతరం బ్రష్ చేయాలి. ఇలా చేస్తే పళ్లపై పాచి ఎక్కువగా పట్టదు.
బేకింగ్ సోడాకు కొద్దిగా నీటిని కలిపి పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌తో పళ్లు తోముకోవాలి. కొన్ని నిమిషాల తర్వాత మంచి నీటితో పళ్లను క్లీన్ చేసుకోవాలి. ఇలా రోజుకు ఒకటి రెండు సార్లు చేస్తే మీ పళ్లు మిలమిల మెరుస్తాయి.