వైద్యశాఖలో నోటిఫికేషన్ విడుదల చేసే పోస్టులు ఇవే..

0
78

తెలంగాణలోని నిరుద్యోగులకు సర్కార్ తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 30,453 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌డానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా అనుమ‌తి ఇచ్చింది. ఈ మేరకు శాఖల వారిగా పోస్టులను వెల్లడించింది. వైద్య, ఆరోగ్యసేవల నియామక బోర్డు ద్వారా 10 వేల 28 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

వైద్యశాఖలో నోటిఫికేషన్ విడుదల చేసే పోస్టులు ఇవే..

ఎంపీహెచ్​ఏ మహిళ-1520, వైద్యవిద్య అసిస్టెంట్ ప్రొఫెసర్-1,183, వైద్యవిద్య స్టాఫ్‌నర్స్- 3,823, వైద్యవిద్య ట్యూటర్- 357 పోస్టులు ఉన్నాయి. ప్రజారోగ్య సివిల్ అసిస్టెంట్ సర్జన్-751 ఖాళీలు భర్తీ చేస్తారు. వైద్య విధాన పరిషత్ సివిల్ అసిస్టెంట్ సర్జన్-1,284, వైద్య విధాన పరిషత్ ఏఎన్ఎం -265, వైద్య విధాన పరిషత్ స్టాఫ్ నర్సు- 757 పోస్టులు ఉన్నాయి.

అలాగే శాఖాపరమైన ఎంపిక కమిటీ ద్వారా నిమ్స్‌లో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తారు. టీఎస్​పీఎస్సీ ద్వారా వైద్య, ఆరోగ్యశాఖలో 2,662 పోస్టుల నియామకాలు చేపట్టనున్నారు. అనుమతించిన పోస్టుల భర్తీకి సంబంధించి నియామక సంస్థలు తగిన చర్యలు తీసుకోవాలన్న ఆర్థికశాఖ… రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ సహా అన్ని వివరాలను అందించాలని ఆయా శాఖలకు స్పష్టం చేసింది.