IPL: ముచ్చటగా మూడోసారి..KKR కప్పు కొట్టేనా? శ్రేయస్ సేన బలం, బలహీనత ఇవే..

IPL: Happily for the third time .. Will KKR hit the cup?

0
45

మరో ఐదు రోజుల్లో ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అన్ని జట్లు కప్పు కొట్టాలని తహతహలాడుతున్నాయి. కేకేఆర్‌ జట్టు 2012, 2014లో గౌతమ్‌ గంభీర్‌ కెప్టెన్‌ గా ఉన్న సమయంలో ఛాంపియన్‌ గా నిలిచింది. 2021లో అద్భుత ప్రదర్శన చేసిన ఆ టీం.. ఫైనల్‌ వరకు చేరినా..విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. మరి కొత్త సారథి రాకతో కేకేఆర్ కప్పు కొడుతుందా? శ్రేయస్ సేన బలాలు, బలహీనతలు ఏంటో చూద్దాం..

గత సీజన్‌ లో కేకేఆర్‌ జట్టులో కీలక ఆటగాళ్లు ఉన్నారు. గిల్‌, రాహుల్‌ త్రిపాఠి, ప్రసిద్ధ్‌ కృష్ణ లాంటి ప్లేయర్లు ఇప్పుడు ఆ జట్టుకు దూరమయ్యారు. గతేడాది ఫామ్‌ లో లేని హర్డ్‌ హిట్టర్‌ రస్సెల్‌ ను మరోసారి రీటెయిన్‌ చేసుకుంది కేకేఆర్‌. అతనితో పాటు సునీల్‌ నరైన్‌, ఆల్‌ రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌, వరుణ్‌ చక్రవర్తిని కూడా కేకేఆర్‌.. వేలంలోకి వెళ్లకుండా కాపాడుకుంది.శ్రేయస్‌ అయ్యర్‌ను కేకేఆర్‌ పన్నెండున్నర కోట్లకు కొనుగులు చేసి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.

బలాలు:

శ్రేయస్‌ తో పాటు జట్టులో వెంకటేశ్‌ అయ్యర్, రస్సెల్‌, చమిక కరుణరత్నె, సునిల్‌ నరైన్, నితీశ్ రాణా, ప్యాట్ కమిన్స్, మహమ్మద్ నబీ, అంజిక్య రహానె కీలకం కానున్నారు. బౌలింగ్‌ విభాగాల్లో ఆస్ట్రేలియన్‌ పేసర్‌ కమిన్స్‌ తో పాటు ఉమేశ్‌ యాదవ్‌, శివమ్‌ మావి, సౌథీ ఉండనే ఉన్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో సునిల్ నరైన్, ఆండ్రూ రస్సెల్ కు టీంలో చోటు ఖాయంగా కనిపిస్తుంది.

బలహీనతలు:

కేకేఆర్ జట్టు కీలక ప్లేయర్లు కమిన్స్, అరోన్ ఫించ్ మొదటి ఐదు మ్యాచ్‌లకు దూరమవ్వడం బ్యాడ్ న్యూస్

శామ్ బిల్లింగ్స్, మహమ్మద్ నబీ ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి.

ముఖ్యంగా గిల్, రాహుల్ త్రిపాఠి స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లు ఎవరూ లేకపోవడం.