ప్రమాదాలు ఎప్పుడు ఎలా ఎక్కడ జరుగుతాయో ఎవ్వరూ ఊహించలేరు. అయితే కొన్ని ప్రమాదాలు అపార నష్టాన్ని కలిగించగా మరికొన్ని స్వల్ప నష్టాన్ని చేకూరుస్తాయి. తాజాగా కరెంటు పోల్ ను విమానం ఢీకొన్న ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఈ రోజు ఉదయం ఎస్జీ160 విమానం ఢిల్లీ నుంచి జమ్మూకు వెళ్లాల్సి ఉంది. ప్రయాణికులు విమానం ఎక్కిన తర్వాత.. పుష్ బ్యాక్ చేస్తున్న సమయంలో విమానం కుడి వైపు రెక్క విద్యుత్ పోల్‌ను తాకింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను విమానం నుంచి దింపి, మరో విమానంలో జమ్మూకు పంపించినట్టు అధికారులు తెలిపారు.