సూర్య‌తో న‌టించే బంప‌ర్ ఆఫ‌ర్‌ కొట్టిన బేబమ్మ..దర్శకుడు ఎవరో తెలుసా?

0
93

తమిళ్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు బాల కాంబినేషన్‌ లో ఇటీవ‌లే రెండు సినిమాలతో ప్రేక్ష‌కుల ఎంతో అలరించారు. సూర్య కెరీర్‌ లోనే బాస్ట‌ర్ హిట్స్ గానిలిచిన నంద, పితామగన్‌ చిత్రాల తర్వాత మరోసారి బాలాతో ముచ్చటగా మూడో సినిమా చేయబోతున్నారు సూర్య.

ఇక ఇవాళ వీరిద్దరి కాంబినేషన్‌ లో మూడో సినిమా కన్యాకుమారిలో పూజా కార్యక్రమాలతో మొదలు కానుంది. జ్యోతిక, సూర్య సమర్పణలో వారికి చెందిన 2 డీ ఎంటర్‌ టైన్మెంట్స్‌ బ్యానర్‌ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఉప్పెన‌, శ్యామ్ సింగ రాయ్ చిత్రాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కృతిశెట్టి. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోతో నటించేందుకు సిద్దమవుతుంది. సూర్య నటించబోయే ఈ 41వ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ విషయాన్ని చి త్ర బృందం స్వయంగా ప్రకటించింది.

కృతిశెట్టి యాక్టింగ్‌కు ఇంప్రెస్ అయిన బాలా ఆమెను హీరోయిన్‌గా ఫైన‌ల్ చేశాడ‌ట‌. ఈ భామ ఇప్ప‌టికే ప‌లు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తోంది.ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా వదిలింది చిత్ర యూనిట్. అంతే కాకుండా ఈ సినిమాలో కూడా సూర్య లాయర్‌ గెటప్‌ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.