మార్చి 31లోపు ఈ స్కీమ్‌లో చేరితే.. ప్రతి నెల పెన్షన్ తప్పనిసరి!

0
103

ఈ మధ్య కాలంలో చాలా మంది తమకి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. దీనికి కారణం మంచి లాభాలు రావడం. అలాంటి వాళ్ళ కోసం మరో కొత్త స్కీమ్స్ ను పరిచయం చేస్తుంది ప్రభుత్వం. ఎలాంటి రిస్క్ లేకుండా కచ్చితమైన రాబడి వచ్చే పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. అదే  ప్రధాన్ మంత్రి వయ వందన యోజన.

ఇందులో చేరితే కచ్చితమైన పెన్షన్ వస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు ఎలాంటి రిస్క్ ఉండదు. దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటోంది.

ప్రస్తుతం ప్రధాన్ మంత్రి వయ వందన యోజన పథకంపై 7.4 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం పదేళ్లు. అంటే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే పదేళ్ల వరకు ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు. ఈ పథకంలో 2023 మార్చి నెల చివరి వరకు అందుబాటులో ఉంటుంది. అయితే ఈ మార్చి 31 తర్వాత వడ్డీ రేటు మారే అవకాశం ఉందని నివేదికలు వెలువడుతున్నాయి. అందుకే ముందుగానే చేరితే 7.4 శాతం వడ్డీని పొందొచ్చు.

ఈ స్కీమ్ లో భార్యాభర్తలు ఇద్దరూ డబ్బులు పెడితే రూ.18 వేలకు పైగా పొందొచ్చు. అయితే రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. డబ్బులు ఇన్వెస్ట్ చేసినవారు మరణిస్తే ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని నామినీకి ఇస్తారు.