ఏపీ నిరుద్యోగులు అలర్ట్..దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తోంది

0
35

ఏపీ సర్కార్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. విజయవాడలో యానిమల్ హజ్బెండరీ విభాగంలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ (బ్యాక్‌లాగ్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు: 24

వీటిలో క్లాస్‌ ఏ (26) ,క్లాస్‌ బి (02) ఖాళీలు ఉన్నాయి.

పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తులను డైరెక్టర్‌ యానిమల్‌ హజ్బెండరీ డిపార్ట్‌మెంట్, లబ్బిపేట, విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌ అడ్రస్‌కు పంపించాలి.

దరఖాస్తుల స్వీకరణకు 31-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.