గ్రాండ్ గా ‘గని’ ప్రీ రిలీజ్ ఈవెంట్..ముఖ్య అతిథిగా స్టార్ హీరో!

0
100

మెగా హీరో వరుణ్ తేజ్ తాజా మూవీ ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఏప్రిల్‌ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 2న వైజాగ్‌లో ఈ  ఈవెంట్ గ్రాండ్‌గా జరుగుతుందని తెలియజేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అదే పోస్టర్ లో ఈ కార్యక్రమానికి విచ్చేయనున్న ముఖ్య అతిథి ఎవరో కూడా ప్రకటించారు.

“గని” ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కాగా అల్లు అర్జున్ “పుష్ప”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని, “పుష్ప 2” షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు.