ధాన్యం కొనుగోళ్లపై రాహుల్‌ గాంధీ ట్వీట్..ఎమ్మెల్సీ కవిత కౌంటర్‌

0
109

తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో స్పందించారు. ధాన్యం పూర్తిగా కొనేవరకు రాష్ట్ర రైతుల తరఫున పోరాటం చేస్తామని వెల్లడించారు. ధాన్యం సేకరణలో భాజపా, తెరాస ప్రభుత్వాల వైఖరి సిగ్గుచేటని రాహుల్‌ గాంధీ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. రైతుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణను రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు.

ధాన్యం ‌కొనుగోలుపై రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ కి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ గారు, రాజకీయ లబ్ది కోసం నామమాత్రంగా ట్విట్టర్ లో సంఘీభావం తెలుపడం కాదు. ఎమ్మెల్సీ కవిత ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి పంజాబ్‌, హ‌ర్యానా రాష్ట్రాల‌కు ఒక నీతి, ఇత‌ర రాష్ట్రాల‌కు మ‌రో నీతి ఉండకూడదన్నారు.

టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు ప్రతిరోజు పార్లమెంట్ వెల్ లోకి వెళ్లి తమ నిరసన తెలియజేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ కవిత. మీకు నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్ లోకి వచ్చి నిరసన తెలియజేయాలని కవిత అన్నారు. ఒక దేశం ఒకే సేక‌ర‌ణ విధానం కోసం డిమాండ్ చేయాలని రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ కవిత సూచించారు.

https://twitter.com/RahulGandhi?

https://twitter.com/RaoKavitha?