నమస్తే తెలంగాణ మాజీ ఎండీకి కేసీఆర్ బంపర్ ఆఫర్?

0
89

టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నమస్తే తెలంగాణ పత్రిక మాజీ ఎండీ సీఎల్ రాజంను రాజ్యసభకు పంపించాలని టీఆర్ఎస్ భావిస్తుంది. త్వరలో పదవీకాలం పూర్తికానున్న లక్ష్మీకాంతరావు స్థానంలో ఆయనకు అవకాశాన్ని ఇవ్వాలనుకుంటున్నది.

గతంలోనే ఈయనను రాజ్యసభకు పంపించాలని సీఎం కేసీఆర్ భావించారు. కానీ ఆ తర్వాత మారిన పరిస్థితుల వల్ల అది సాకారం కాలేదు. వ్యాపారవేత్తగా, కాంట్రాక్టరుగా, పారిశ్రామికవేత్తగా ఆర్థికంగా బలంగా ఉన్న సీఎల్ రాజం తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్‌కు అనేక రకాలుగా ఉపయోగపడ్డారు.

టీఆర్ఎస్ కు కూడా ఆయన సేవలు బాగా లాభించాయి. ఒకే జిల్లా ఒకే సామాజిక వర్గం కావడంతో ఆ స్థానాన్ని సి ఎల్ రాజం తో భర్తీ చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే ఈసారి మాత్రం ఆయనను రాజ్యసభకు పంపించే విధంగా స్కెచ్ వేస్తున్నారట గులాబీ పార్టీ అధినేత కేసీఆర్.