ఆర్ఆర్ఆర్ వ‌సూళ్ల సునామి.. 7 రోజుల్లోనే ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే?

0
109

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘RRR’. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ట్రిపుల్ ఆర్ మార్చి 25న రిలీజ్ అయ్యింది.

పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడం వల్ల మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఈ సినిమా మొదటి వారాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ట్రిపుల్ఆర్ పాజిటివ్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్లతో దుమ్ములేపుతుంది.

ఏడురోజులు పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.710 కోట్లు గ్రాస్​ సాధించింది. కర్ణాటక, తమిళనాడులో సైతం మంచి వసూళ్లతోనే మొదటి వారాన్ని ముగించింది ట్రిపుల్ ఆర్. ఆర్​ఆర్​ఆర్​ ఈ వీకెండ్ లో జోరు అందుకొని లాభాల బాట పడుతుంది.