ఉగాది పండుగ వెనకనున్న సైంటిఫిక్ కారణాలు ఇవే..

0
97

ఉగాది వసంత బుతువులో వస్తుంది. ఈ సమయంలో అనేకమంది రోగాల బారిన పడి మరణిస్తారు. దానికి గల కారణం యముడు తన కోరలు బయటకు పెట్టి అనేక మంది జనాలను నాశనం చేస్తాడని అర్ధం. కాబట్టి జనం ఈ కాలంలో ఎక్కువ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి.

ఉగాది పచ్చడి ఒక మహాఔషదం. ఉగాది పచ్చడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. షడ్రుచుల సమ్మేళనంగా తయారుచేసే ఈ  పచ్చడి  జీవితంలో ఎదురయ్యే ఎన్నో అనుభవాలను, ఘటనలను సూచిస్తుంది. ఈ పచ్చడిలో వేసే ఒక్కో పదార్థం ఒక్కో భావానికి ప్రతీక.

ఈ ఉగాది పచ్చడి తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఆ సంవత్సరం మొత్తం రోగాలు దరిచేరవు. ఉగాది పచ్చడిలో ఉండే వేపపువ్వు కడుపులో ఉన్న నులిపురుగులను చంపేస్తుంది. మామిడి ఆకుల కట్టడం వల్ల ఇంట్లోకి రోగకారక క్రిములు రాకుండా ఆపేస్తాయి.

బంతి పూలలో యాంటీసెప్టిక్, యాంటీ బయోటిక్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఉగాది స్నానం చేయడం వల్ల ఒంటిపై పేరుకుపోయిన విషక్రిమికీటకాలన్నీ తొలగిపోతాయి. చూశారు కదా మన పండుగతో ఎన్ని లాభాలున్నాయో..అందుకే మనంజరుపుకునే ప్రతి పండుగ వెనక ఏదో ఒక సైటింఫిక్ రీజన్ తప్పకుండా ఉంటుంది.