తెలంగాణ: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం పంటి చికిత్స చేయించుకున్నారు. కొద్దిరోజులుగా పంటి నొప్పితో తీవ్ర ఇబ్బంది పడుతున్న సీఎం కేసీఆర్కు పంటి చికిత్స చేసి ఓ పన్నును తొలగించినట్టు సన్నిహిత వర్గాలు తెలియజేశాయి. అంతేకాకుండా రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు చెబుతున్నారు.