బన్నీకి చిరంజీవి బర్త్‌ డే విషెస్..

0
80

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో చిత్ర సీమలో అడుగుపెట్టి మనందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం పుష్ప సినిమాతో బాక్స్ ఆఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు. అంతేకాకుండా తాజాగా ఓ పాన్ ఇండియా సినిమా పట్టాలెక్కించబోతున్నట్టు సమాచారం. నేడు అల్లుఅర్జున్ పుట్టిన రోజు సందర్బంగా చిత్రసీమలో చాలామంది విషెస్ తెలియజేస్తున్నారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్ తెలియజేశారు. ట్విట్టర్ వేదిక ద్వారా బన్నీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ కృషి మీ ఏకాగ్రత అవే మిమ్మల్ని విజయంవైపు  నడిపిస్తాయని అల్లు అర్జున్ ని పొగిడారు. బన్ని ఒక ల్యాండ్ మార్క్ అని కొనియాడారు. ఈ పుట్టిన రోజుని గుర్తుండిపోయేలా జరుపుకోవాలని చిరు తన ట్విట్టర్ వేదిక ద్వారా బన్నీకి శుభాకాంక్షలు తెలియజేశారు.