రికార్డు స్థాయిలో నిమ్మ ధర..

0
43

వేసవి వచ్చిందంటే చాలామంది నిమ్మకాయ రసం తాగడానికి మొగ్గుచూపుతారు. వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. కానీ ఈసారి వేసవికి సామాన్యుడికి కొనలేనంత భారీగా పెరిగిపోయాయి నిమ్మకాయ ధరలు. దీంతో నిమ్మకాయలు కొనాలంటే కొనుగోలు దారులు బెంబేలెత్తిపోతున్నారు.

గతంలో కేజీ నిమ్మకాయల ధర రూ. 50-60 ఉంటే ప్రస్తుతం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. కేజీ నిమ్మకాయ ధర రూ. 200 పైగానే ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో నిమ్మకాయ ధర రూ. 15 పలుకుతుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ సారి కాపులేకపోవడం వల్లే ధరలు అమాంతం పెరిగిపోయాయని వ్యాపారాలు చెప్తున్నారు.