వారికీ సీఎం జగన్ రూ.2లక్షల ఆర్థిక సహాయం

0
118

సీఎం జగన్ దేశవ్యాప్తంగా ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తూ ఆదుకుంటున్నాడు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఆదుకుంటున్నందుకు ఎన్నో ప్రశంసలు లభిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ వద్ద  రైలు ఢీకొని పలువురు మరణించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ ఘటనపై అధికారులు అరా తీయడంతో విశాఖపట్నం నుంచి గౌహతి వెళ్తున్న రైలు సాంకేతిక లోపంతో నిలిచి పోవడంతో..చల్లగాలి కోసం కొంతమంది ప్రయాణికులు దిగారని అదే సమయంలో ట్రాక్‌పై వెళ్తున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ వీరిని ఢీ కొట్టడంతో కొంత మంది మరణించినట్టుగా సీఎం జగన్ కు అధికారులు వెల్లడించారు.

అయితే తాజాగా ఈ ఘటనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనకున్న మంచి మనసుతో మరోసారి ఆ బాధిత కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నట్టు సీఎం జగన్ వెల్లడించారు. అంతేకాకుండా గాయాలు అయినవారికి మంచి వైద్యసేవలు అందేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు.