“ఆచార్య” ట్రైలర్ రిలీస్ కు టైం ఫిక్స్..

0
85

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న భారీ చిత్రం ఆచార్య. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ ​చరణ్ జతగా పూజాహెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ నక్సలైట్లుగా కనబడనున్నారు.

అయితే తాజాగా ఆచార్య మూవీ నుంచి అదిరిపోయే అప్ డేట్ వదిలింది చిత్రబృందం. ఈరోజు సాయంత్రం 5.49 గంటలకు ఈ సినిమా ట్రైలర్ థియేటర్ లలో విడుదల కానున్నట్టు, 7.02 గంటలకు యూట్యూబ్ లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు చిన్న ప్రోమో కూడా రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ మూవీ ఏప్రిల్‌ 29 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.