ఫ్లాష్: ఆచార్య సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు నిరాకరించిన ఏపీ సీఎం..

0
95

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న భారీ చిత్రం ఆచార్య. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ ​చరణ్ జతగా పూజాహెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఏప్రిల్ 14న ట్రైలర్ థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను ఆనందపరిచింది. ఈ సినిమా ఏప్రిల్‌ 29 వ తేదీన విడుదల కానుంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఫంక్షన్‌ ఈ నెల 23 వ తేదీన విజయవాడలో సిద్దార్థ కాలేజీలో జరగనున్నట్టు తెలిపారు. కానీ చిత్రబృందం మనస్సు మార్చుకొని హైదరాబాద్ లో అదే రోజున యూసఫ్‌ గూడలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ లో నిర్వహించింది. ఈ మేరకు ఆచార్య చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది.

ఈ మార్పుకు గల కారణం ఏంటంటే..ఏపీ సీఎం జగన్‌ ఆచార్య సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ ఫంక్షన్ కు వస్తారని భావించి..విజయవాడలో ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది చిత్రబృందం. కానీ ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి రాలేకపోవడంతో వేదికను మార్చుతూ నిర్ణయం తీసుకుంది.