వేసవిలో మొబైల్ ఫోన్ కాలిపోకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి..

0
98

ఈ మధ్యకాలంలో ఫోన్ పేలిపోవడాన్ని తరచుగా చూస్తున్నాం. దానివల్ల కేవలం ఫోన్ మాత్రమే కాకుండా పట్టుకున్న మనుషులకు కూడా తీవ్ర గాయాలు కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా  కొంతమంది మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ బ్యాటరీలు కాలిపోవడానికి గల ముఖ్య కారణాలు ఏంటో మీరు కూడా తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి..

స్మార్ట్ ఫోన్ బ్యాటరీలు తక్కువ టెంపరేచర్ లలో పనిచేసేలా రూపొందిస్తారు. అందుకే ఎక్కువ సేపు హై టెంపరేచర్ ఉన్న వాతావరణంలో పెట్టడం వల్ల బ్యాటరీ డ్యామేజ్ అవుతుంది. అందుకే ఎట్టి పరిస్థుతలలో ఫోన్ హై టెంపరేచర్ లో పెట్టకూడదు. అంతేకాకుండా సూర్యుడి కిరణాలు పడేటట్టు ఎక్కువసేపు వదిలేసినా లేదంటే కారులో ఎక్కువసేపు వదిలేసినా ఫోన్స్ ఎక్కువగా హీట్ అయిపోయి బ్యాటరీలో ఉండే సెల్స్ అన్ స్టేబుల్ అయ్యి..కార్బన్డయాక్సైడ్ మరియు ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది.

దీనితో ఫోన్ పేలిపోవడం మంటలు రావడం లాంటివి జరుగుతాయి. ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టిఉంచిన సరే వేడెక్కిపోతుంది. దీనివల్ల కూడా పేలిపోయే అవకాశం ఉంటుంది. చార్జింగ్ లో పెట్టి ఫోన్ వాడడం వల్ల కూడా వేడెక్కి మంటలు వచ్చే అవకాశం వుంది లేదా ఫోన్ పేలిపోతుంది. ఎవరి స్మార్ట్ ఫోన్ చార్జర్ ని వారే ఉపయోగించాలి మరొక బ్రాండ్ చార్జర్ ని వాడడం వల్ల కూడా ఫోన్ పేలిపోయే అవకాశం ఉంటుంది.