మెదడు చురుగ్గా పనిచేయాలంటేఇలా చేయండి..

0
70
Brain Exercise

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం బ్రెయిన్ అని అందరికి తెలుసు. అందుకే మెదడు ఎంత చురుగ్గా ఉంటే మనం అంత యాక్టీవ్ ఉంటాము. అందుకే ఉదయం లేవగానే రోజులో చేయబోయే, జరగబోయే వాటి గురించే ఆలోచించకూడదు. దానివల్ల ప్రశాంతతను కోల్పోతామని మానసిక నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రతి రోజు లేవగానే ఈ చిట్కాలు ప్రయత్నిస్తే మెదడు చురుగ్గా పనిచేయడానికి దోహదపడుతుంది.

రోజు ఉదయాన్నే లేవగానే కనీసం 5 నిమిషాలైనా ప్రశాంతంగా పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల కొత్త విషయాలు తెలిసి మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది. మిమ్మల్ని గత విషయాలకు, జరగబోయే విషయాలకు దూరంగా తీసుకెళ్లి మెదడును కూడా ప్రశాంతత ఉంచుతుంది. ధ్యానం చేయటం వల్ల మనసుకు, మెదడుకు ప్రశాంతత లభిస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, బుద్ధికుశలత అధికంగా పెరుగుతాయి. అందుకే ధ్యానం చేసేవాళ్లు ఏ విషయాన్నైనా టక్కున గుర్తుతెచుకుంటారు.

ఉదయాన్నే పదవినోదం, సుడోకు, పజిల్స్‌ వంటివి ఆడుతూ ఉండడం వల్ల మెదడు పనితీరు క్రమక్రమంగా మెరుగుపడుతుంది. వ్యాయామం శరీరానికి, ఆరోగ్యానికే కాదు. మెదడుకూ కూడా చాలా మేలు చేస్తుంది. మెదడుకు తగినంత ఆక్సిజన్‌ రక్తాన్ని సరఫరా చేయడంలో వ్యాయామం ఉపయోగపడుతుంది. ఉదయం లేవగానే చక్కటి సంగీతాన్ని వినడం కూడా అలవాటు చేసుకోవడం మంచిది.