భారత ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్ బ్యాంక్ సబ్సిడరీ సంస్థ అయినటువంటి ఇండ్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ లిమిటెడ్ లో పలు ఖాళీలు వున్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్ ని విడుదల చేసారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు.
పూర్తి వివరాలు మీ కోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు: 07
పోస్టుల వివరాలు: ఫీల్డ్ స్టాఫ్, అకౌంట్ ఓపెనింగ్ స్టాఫ్, హెల్ప్ డెస్క్ స్టాఫ్, రిసెర్చ్ అనలిస్ట్, సిస్టమ్స్ అండ్ నెట్వర్క్ ఇంజినీర్
అర్హులు: . ఇంటర్మీడియట్, ఏదైనా గ్రాడ్యుయేషన్, బీఈ, బీ.టెక్, ఎంబీఏ ఉత్తీర్ణత అయ్యి ఉండాలి. పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయస్సు: 35 ఏళ్ళు నుండి 65 ఏళ్ల వయస్సు మించరాదు.
జీతం:నెలకు రూ.25,000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తువిధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 26, 2022.