టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ మరియు ఆయన భార్య జీవితలుపై జ్యోస్టర్ ఎండీ హేమ దంపతులు సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ. గరుడ వేగ సినిమా నిర్మాణం కోసం జీవితారాజశేఖర్ దంపతులకు ఆస్తులు తాకట్టుపెట్టి తమ దగ్గర నుంచి రూ.26 కోట్లు ఇచ్చామని..కానీ ఇప్పుడు ఆ డబ్బు తిరిగి ఇవ్వడం లేదని తీవ్రంగా మండిపడ్డారు.
అయితే తమకు తెలియకుండా ఆ ప్రాపర్టీని మరొకరికి అమ్మి రూ.26 కోట్లు ఇద్దరు కలసి ఎగ్గొట్టారని తెలిపారు. వారిని మోసం చేశారని వాపోయారు. త్వరలో రాజశేఖర్ జైలుకు వేళ్ళడం ఖాయం అని షాకింగ్ కామెంట్స్ చేసారు. వారు కేవలం బయటి ప్రపంచంలోనే చాలా మంచి మనుషులుగా నటిస్తున్నారని తెలిపారు.
ఈ వ్యాఖ్యలపై జీవిత రాజశేఖర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై తిరువాళ్లూరులో కేసు పెట్టామని ఆమె పేర్కొన్నారు. చెక్ బౌన్స్ కేసులో జీవితా రాజశేఖర్ పై నగరి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది.