డ్రై ఫ్రూప్ట్స్ నానబెట్టి తింటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి..

0
30

ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. కానీ తెలియక చేసిన తప్పుల వల్ల కూడా అనేక రకాల సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే ముందే అలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే ఒక్కసారి ఇవి చూడండి. చాలామంది తెలియక అన్ని రకాల డ్రై ఫ్రూప్ట్స్ ని నానబెట్టుకొని తింటుంటారు. కానీ అల చేయడం వల్ల ఏం జరుగుతుందో మీరే చూడండి.

ఎండినపండ్లు వేడిగా ఉంటాయి. దీనివల్ల అనేక రకాల జీర్ణ సమస్యలు వస్తుంటాయి. అందుకే నీళ్లలో నానబెట్టుకొని తినాలని వైద్యులు సూచించారు. కానీ జీడిపప్పు మాత్రం నీళ్ళల్లో నానబెట్టి తినకూడదు. ఎందుకంటే ఇది చాలా మృదువుగా ఉంటుంది. అందువల్ల నీళ్లలో నానబెట్టడం వల్ల దాని రుచి పోవడంతో పాటు..పోషకాలు కూడా నీటిలో కలిసిపోతాయి.

బాదం పప్పు, ఎండుద్రాక్ష నీటిలో నానబెట్టుకొని తిన్న ఎలాంటి నష్టాలు చేకూరే అవకాశం లేదు. ఎండు ఖర్జూరాలు కూడా నానబెట్టి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో  ఐరన్  కంటెంట్ సమృద్ధిగా లభిస్తుంది. వీటితో పాటు విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎముకలు దృఢంగా చేయడంలో కూడా తోడ్పడతాయి. కేవలం జీడిపప్పు మాత్రమే నీళ్ళలో నానబెట్టుకొని తినొద్దంటున్నారు నిపుణులు.