నెలకి రూ.5000 పొందే సూపర్ స్కీమ్..పూర్తి వివరాలివే?

0
99

కరోనా సంక్షోభంతో ప్రజలు స్కీమ్స్ లో డబ్బులు పెట్టడానికి ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. ఈ మధ్య కాలంలో ఎవరికి నచ్చిన స్కీమ్స్ లో వాళ్ళు డబ్బులు పెట్టి అధిక లాభాలు రాబడుతున్నారు. సరల్ పెన్షన్ యోజన చేరితే అధిక రాబడి పొందడం ఖాయం అంటున్నారు అధికారులు. అంతేకాకుండా ఎలాంటి రిస్క్ కూడా ఉండదు.

పూర్తి వివరాలు మీ కోసం..

ప్రస్తుతం ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరిన సబ్‌స్క్రయిబర్ల సంఖ్య 4 కోట్ల కి చేరింది. ఈ స్కీమ్ కింద ప్రతి నెల మినిమమ్  రూ.1000 నుంచి రూ.5000 మధ్య లో పెన్షన్ ని పొందవచ్చు. ఒకవేళ మీరు అధిక డబ్బు చెల్లిస్తే దానిని బట్టి పెన్షన్ వస్తుంది. ఈ అకౌంట్లను తీసుకున్న వారిలో 44 శాతం మంది మహిళలు కాగా, 56 శాతం పురుషులు ఉన్నట్టు తెలుస్తోంది.

అలానే ఈ స్కీమ్ అధికంగా 18 నుంచి 25 ఏళ్ల ఉన్నవారే ఉపయోగించుకుంటున్నారు. ఎక్కువ మంది సబ్‌స్క్రయిబర్లు 1000 పెన్షన్ ప్లాన్‌ను ఎంపిక చేసుకున్నారు.  దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీలు, ఆర్‌ఆర్‌బీలతో కలిసి ఈ స్కీమ్ ని విజయవంతంగా నడిపించాలని చూస్తుందని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీట్ తెలిపింది.