బరువు త్వరగా తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి..

0
41

ఈ మధ్య కాలంలో బరువు పెరగడం పెద్ద సమస్యగా మారింది. ఎక్సర్‌సైజులు, డైటింగులు చేస్తూ ఎంతో శ్రమించిన మంచి ఫలితాలు రానివాళ్లు, బరువు తగ్గాలని కడుపు మాడ్చుకొని ఉండేవాళ్ళు ఒక్కసారి ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా ఈ ఆహారం తీసుకోవడం వల్ల కూడా త్వరగా బరువు తగ్గొచ్చు.

ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కొవ్వు తొందరగా కరిగిపోతుంది. ఎక్కువ పీచు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల బరువు త్వరగా తగ్గవచ్చు. చక్కర  వినియోగం ఎంత తగ్గిస్తే అంత మంచిదంటున్నారు నిపుణులు. పిండి పదార్థాలను తినడం ఎంత తాగిస్తే అంత మంచిది. శరీరానికి తగినంత నీరు అందకపోయినా బరువు పెరిగే అవకాశం ఉంది. అందుకే రోజుకు సరిపడా నీళ్లు తాగాలి.

గ్రీన్ టీ  తాగడం వల్ల కూడా త్వరగా బరువు తగ్గొచ్చు. ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం వల్ల కొవ్వు కరిగిపోతుంది. తగినంత నిద్ర లేకపోయినా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం మంచిది. స్వీట్ ఫుడ్‌ని వీలైనంత వరకు దూరంగా ఉండడంతో పాటు..బేకరీ ఫుడ్ ని కూడా ఎక్కువగా తినకూడదు. అంతేకాకుండా ఉడికించిన కోడి గుడ్లు రోజుకు కనీసం ఒక్కటైనా తినాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.