అవేంజర్స్ పై పలు దేశాలు నిషేధం..ఎందుకో తెలుసా?

0
110

హాలీవుడ్ చిత్రాలను ఇష్టపడే ప్రేమికులకు అవెంజర్స్ సిరీస్ సినిమాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘మార్వెల్ స్టూడియో’ వారి ‘అవేంజర్స్’ సీరిస్‌కు ప్రపంచవ్యాప్తంగా మాంచి క్రేజ్ తో పాటు..ఈ సిరీస్ లో తీసిన అన్ని సినిమాలు మంచి కలెక్షన్స్ రాబట్టాయి. ముఖ్యంగా 2019లో వచ్చిన అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఇటీవల విడుదలయి సూపర్ హిట్ అందుకొని భారీ కలెక్షన్స్ కూడా రాబట్టింది.

అవతార్ సినిమాను కూడా బ్రేక్ చేసి దీ వన్ గా నిలిచి సంచలనం సృష్టించండి. మార్వెల్ సంస్థ ద్వారా ఇప్పటి వరకు విడుదలైన సూపర్ హీరోస్ పాత్రలతో ఈ ‘అవేంజర్స్‌’ సీరిస్‌లను రూపొందిస్తున్నారు.  ఇటీవలే విడుదలైన స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ సినిమా కూడా కలెక్షన్ ల మోత మోగించింది. ఈ అవేంజర్స్‌ సిరీస్ సినిమాలకు ఇంత క్రేజ్ ఉండడంతో  ఈ సిరీస్ లో ‘డాక్టర్ స్ట్రైంజ్: మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్’అనే కొత్త సినిమా రాబోతుంది.

మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో  విడుదలయి సందడి చేయనుందనుకుంటే ఈ సినిమాలో ఒక క్యారక్టర్ వల్ల ఈ మూవీపై సౌదీ అరేబియా నిషేధం విధించింది. ఈ చిత్రంలో ‘బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్ టైటిల్ రోల్ పోషిస్తున్న ‘అమెరికా ఛావెజ్’ అనే క్యారెక్టర్ ఉంది. ఈ పాత్రకు జోచిటిల్ గోమెజ్ నటించింది. కానీ అది ‘గే’ క్యారెక్టర్ కావడంతో సౌదీ ఫిల్మ్ బోర్డు డిస్ట్రిబ్యూషన్ సర్టిఫికేట్‌ని జారీ చేయలేదు. కేవలం సౌదీనే కాకుండా మరికొన్ని గల్ఫ్ దేశాలు సైతం ఇదే కారణంగా ఈ మూవీపై బ్యాన్ విధించాయి. మార్వెల్ మూవీ ‘ది ఎటర్నెల్స్‌’ లో కూడా ‘గే’ పాత్రలు ఉండడంతో అది కూడా నిషేదించారు.