సెక్యూరిటీ కోసం ఆధార్ మాస్క్డ్ చేసుకోండిలా?

0
108

మనకి ఉండే ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు తప్పకుండా ఉంటుంది. మనము ఎలాంటి సర్టిఫికెట్ పొందాలన్న, మనము దేనికైనా అప్లై చేసుకోవాలన్న ఆధార్ కార్డు అడుగుతారు. అందుకే ఆధార్ కార్డును జాగ్రత్తగా ఉంచుకోవాలి. బ్యాంకు ఖాతా ఓపెన్, ఎలాంటి స్కీములకైనా ఆధార్ కార్డ్ చాలా అవసరం.

ఈ మధ్య కాలం లో ఆధార్ కార్డు వినియోగదారులు వివిధ రకాల మోసాలకు గురవుతున్నారు. అందుకే ఇలా జరగకుండా ఉండాలని యుఐడిఎఐ ఒక నిర్ణయం తీసుకుంది. అదే మాస్క్డ్ ఆధార్ కార్డులను తీసుకురావడం వల్ల ఇందులో చివరి నాలుగు అంకెల మాత్రమే కనపడడం వల్ల ఇతరులు కనపడదు. కాబట్టి ఎలాంటి మోసాలకు గురికాకుండా ఉంటాము. మీరు కూడా  మాస్క్డ్ ఆధార్ కార్డ్ ని పొందాలంటే ఇలా చేయండి.

మొదటగా దీని కోసం యుఐడిఎఐ వెబ్ సైట్ లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత  డౌన్ లోడ్ ఆధార్ పైన క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ కనపడతాయి. మాస్క్డ్ ఆధార్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చెయ్యండి. మీ ఫోన్ కి ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేసి డౌన్ లోడ్ ఆధార్ పైన క్లిక్ చేయండి. అంతే మాస్క్డ్ ఆధార్ కార్డు డౌన్లోడ్ అవుతుంది. ఆ తర్వాత పాస్వర్డ్ మీ ఈమెయిల్ కి వస్తుంది. ఇలా మీరు ఆధార్ కార్డు ని వాడచ్చు.