ఒడిశా రాష్ట్రంలోని కొంధమాల్ జిల్లా పూల్భాణీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అంగద కన్హర్ చేసిన ఘటన ప్రస్తుతం అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది. చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించి అందరిలో దృఢ సంకల్పాన్ని పునరావృద్ది చేసాడు. ఈయన 1980లోనే తన చదువు ఆపేయడంతో కనీసం పదవ తరగతి పూర్తి చేయలేదని బాధపడేవారు.
దాంతో ఎలాగైనా పదవ తరగతి పూర్తిచేయాలనీ సంకల్పంతో శుక్రవారం మొదలైన పదవ తరగతి పరీక్షలను రాసాడు. కంధమాల్ జిల్లా పితాబరి గ్రామంలోని రుజంగీ ఉన్నత పాఠశాలలో 67 మంది విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే పదో తరగతి పరీక్షను రాశారు. అందరి ప్రోత్సహం వల్లే నేను ఈ రోజు పరీక్ష రాసానని తెలిపారు.
నేను పరీక్షలో ఉత్తీర్ణత సాధించగలనో లేదో నాకు తెలియదు కానీ నేను పదవ తరగతి పాస్ అవ్వడానికి నా పరీక్షను రాశాను” అని కన్హాన్ పరీక్ష అనంతరం చెప్పారు. అయితే ఈ పరీక్షను ఆయన ఒక్కడే కాకుండా..తోడుగా మరికొంత మందితో కూడా పరీక్షలు రాయించాడు. ఈయన రాజకీయాల్లో అద్భుతంగా రాణించాడు.