పసుపు అధికంగా తింటున్నారా? అయితే మీకు ఈ సమస్యలు తప్పవు..

0
112

భారతదేశంలో పసుపు లేకుండా ఏ కూర వండమని అందరికి తెలిసిన విషయమే. ఇది కూర రుచిని, రంగును పెంచి అందరు తినడానికి ఇష్టపడేలా చేస్తుంది. ఇది కేవలం శరీరానికి మేలు చేయడమే కాకుండా అందాన్ని కూడా పంచడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. కానీ పసుపు కూరల్లో అధికంగా వేయడం వల్ల నష్టాలు చేకూరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

పసుపులోని కర్కుమిన్ అనే పదార్థం రక్తాన్ని పలచబరచడం వల్ల చిన్న గాయమైనా కూడా అధికంగా రక్తస్రావం అవుతుంది. ముఖ్యంగా మహిళలు పసుపును అధికంగా తీసుకొవడం వల్ల పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మహిళలు ఇది ఎంత తక్కువ  తీసుకుంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు.

గర్భస్థ సమయంలో  పసుపు ఎక్కువగా తినడం వల్ల తల్లితో పాటు కడుపులోని బిడ్డకు కూడా హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పసుపులో వేడి లక్షణాలు అధికంగా ఉంటాయి. దాని కారణంగా ముక్కులో నుండి రక్తం కారడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని . అందుకే ఎవ్వరైనా పసుపు పరిమిత స్థాయిలోనే తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.