చిన్న నిమ్మకాయతో ఇన్ని లాభాలా..

0
86

వేసవి కాలం వచ్చిందంటే చాలు నిమ్మకాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. నిమ్మకాయలు వేసవిలో అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి అమితమైన మేలు చేకూరుతుంది. శరీరం వేడి కాకుండా ఉంచడంలో నిమ్మకాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయ కేవలం శరీరానికే కాకుండా అందాన్ని పెంచడంలో కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది.

ఇన్ని లాభాలు ఉన్న నిమ్మకాయ మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలిగా మరి. నిమ్మకాయలో విటమిన్ ‘సి’అధికంగా ఉంటుంది. దీనివల్ల రోదనిరోధక శక్తి మెరుగుపడుతుంది. నిమ్మకాయతో షర్బత్, పులిహోర వంటి పదార్దాలు కూడా చేసుకొని తినవచ్చు. ఇది రోజు తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం పడిపోకుండా ఉంటుంది.

అంతేకాకుండా కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా కూడా ఉపయోగపడడంతో పాటు..కిడ్నీలో ఉన్న చిన్న సైజ్ రాళ్లను కూడా కరిగించడంలో కూడా సహాయపడతాయి. అంతేకాకుండా రోజు భోజనం చేసిన తర్వాత ఒక గ్లాస్ నిమ్మరసం తాగడం వల్ల నోటి దుర్వాసన సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. గాయాలు అయినవారు ఇది తాగడం వల్ల త్వరగా మానిపోయే అవకాశం ఉంటుంది.