మీ మెడ‌పై నల్లగా ఉందా? అయితే ఈ సింపుల్ చిట్కాలు పాటించండి..

0
104

మనలో చాలామందికి మెడ‌, మోచేతులు, మోకాళ్ల ప్రాంతాల్లో నల్లగా ఉండడం మనం గమనిస్తూనే ఉంటాము. ఇది ఎవరైనా ఎదుటివారు చూసినప్పుడు అందవిహీనంగా కనబడుతుంటాయి. ఈ సమస్య నుండి బయట పాడటానికి ఎన్నెన్నో చిట్కాలు ప్రయత్నిస్తూ ఉంటాము. నలుపుదనం శాశ్వతంగా తొలగిపోవాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటించి చూడండి..

మొదటి చిట్కా: రెండు టీ స్పూన్ల కాఫీ పౌడ‌ర్ ను ఒక గిన్నెలోకి తీసుకుని స‌గం చెక్క నిమ్మ‌ర‌సం, ఒక టీ స్పూన్ రోజ్ వాట‌ర్‌ ను వేసి క‌లుపుకోవాలి. దీనిని మెడ భాగం, మోచేతులు, మోకాళ్ల ద‌గ్గ‌ర నెమ్మ‌దిగా రాస్తూ మ‌ర్ద‌నా చేసుకోవాలి. 10 నిమిషాల త‌రువాత నీటితో కడిగితే ఆయ ప్రాంతాలలో నలుపుదనం తొలగిపోయి తెల్లగా మారుతుంది. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల అనుకున్న దానికంటే మంచి ఫలితాలు లభిస్తాయి.

రెండవ చిట్కా: ఒక  టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు, ఒక  టేబుల్ స్పూన్ దానిమ్మగింజల రసం, స‌గం చెక్క నిమ్మ‌ర‌సం తీసుకొని బాగా కలిపి మెడ చుట్టూ ఈ మిశ్రమంతో పది నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఈ సమస్య నుండి బయట పడవచ్చు.