తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు డా. చెరుకు సుధాకర్ రావు ప్రేమ వివాహ జంటలకు ప్రభుత్వం సంపూర్ణ రక్షణ కల్పించాలంటూ మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఇప్పటికే పరువు హత్యల కింద ఎంతో మంది ప్రాణాలను బలయిపోయిన కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదంటూ మండిపడ్డారు. ఇలాంటి హత్యలకు వెంటనే అడ్డుకట్ట వేయడంతో పాటు..వారికీ ఆర్థిక సహాయం కూడా అందించి ఆదుకోవాలని తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్ళి జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. కుల, మతాలను కాదని ప్రేమించి పెళ్ళి చేసుకున్న జంటలకు మనం ఉన్నామని భరోసా కల్పించాలని తెలిపారు.
ఇటీవలే హైదరాబాద్‌లో ముస్లీం యువతిని పెళ్ళి చేసుకొని హత్యకు గురయిన నాగరాజు ఉదంతం అందరికి తెలిసిన విషయమే. లవ్ జిహాద్ గావు కేకలు వేసే బిజేపి ఇప్పుడు హింధూ-ముస్లీమ్ అంశాన్ని ఈ హత్య విషయంలో లేవనెత్తుతున్నది. ఎదిగిన పిల్లలు ప్రేమించి పెళ్ళి చేసుకుంటున్నప్పుడు అన్ని తమ ఇష్టం సాంప్రదాయాల ప్రకారమే జరగాలనే మూర్ఖపుతనంలో పరువు హత్యలు, అహంకార హత్యలుగా జీవితాలను బలిగొంటున్నది. హత్యకు గురయిన బిల్లాపురం నాగరాజు మిర్యాలగూడలో హత్యకు గురయిన ప్రణయ్ ఇద్దరూ మాల సామాజిక వర్గానికి చెందినవారే. అమృత స్థానంలో ఆశ్రిన్ సుల్తానా ఉంది.
అమృత తండ్రి మారుతీ రావు స్థానంలో ఆశ్రిన్ సోదరుడు ముబీన్ ఉన్నాడు. అక్కడ సుపారీతో మారుతీరావు చేతికి రక్తం అంటకుండా ప్రణయ్ కిరాతకంగా హత్య చేయబడితే ఇక్కడ షో రూమ్‌లో ఉద్యోగం ముగించుకొని భార్యతో వస్తున్న నాగరాజుపై గడ్డపారతో అనుచరులతో కలిసి కిరాతకంగా హత్య చేశారు. మిర్యాలగూడలో ప్రాణహాని ఉందని ప్రణయ్ పోలీసులకు పిర్యాదు చేసినా, ఇక్కడ వికారాబాద్ పోలీసులను, బాలనగర్ పోలీసులను నాగరాజు ఆశ్రయించినా దారుణంగా హత్య చేయబడ్డాడు. ప్రణయ్ హత్యను అనివార్యమయినా పరువు హత్యగా సమర్ధించుకున్న వాళ్ళు ఇప్పుడు హిందువులకు రక్షణ లేకుండా పోయిందని మాట్లాడుతున్నారు.
హిందు-ముస్లీం బాయి బాయిగా ఉండాలని కోరుకునే ఒవైసీలు, ముల్లాలు ఇప్పుడు ఆశ్రీన్‌కు, భరోస, భవిష్యత్తు కోసం భవిష్యత్తులో ఏ ముస్లీమ్ యువతీ యువకులకైనా ప్రేమ పెళ్ళిల్లకు సహకరించాలి. భారతదేశంలో ఉన్న ప్రజల డిఎన్ఏ అంతా ఒకటేనన్న మోహన్ భగవత్ ఉద్బోదను ఆకలింపు చేసుకొని ఆర్‌యస్సెస్ కార్యకర్తలు ప్రేమికుల రోజును కుల, మతాంతర వివాహాల కోసం స్వచ్చందంగా ముందుకు రావాలి. క్యాస్ట్, రిలిజియన్ నో బార్ పెళ్ళిల్ల ఒకే డియన్ఎ కోసం మైనారిటీలు, కుల సంఘాలతో కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
నరేంద్రమోడీ ప్రభుత్వం సివిల్ కోడ్‌తో పాటు యూనిఫామ్ డిన్ఎ కోసం కులాంతర, మతాంతర వివాహలాకు జెడ్ కేటగిరీ తరహాలో రక్షణ కల్పించి, ఉద్యోగాల్లో ప్రోత్సహాకాలు ప్రకటించి, కనీస ఆర్ధిక సహాయంగా 10 లక్షల రూపాయలు ప్రతి జంటకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, కుల, మైనారిటీ సంఘాలు ఈ డిమాండ్‌పై కలిసి రావాలి. ప్రార్ధనా స్థలాల్లో మైకుల రణగాన ద్వని రచ్చకంటే రక్తమోడుతున్న ఈ హత్యల్ని ఆపడానికి మందిర్, మసీద్, చర్చి, రచ్చబండ, కుల సంఘాల ఆఫీసుల్లో కార్యాచరణ మొదలుపెడదాం. విశ్వగురువు కోసం పోటీపడే భారతదేశం పరువు పరువు, కుల హత్యలతో నివారణతో ముడిపడి ఉందని గుర్తు చేస్తున్నాము.