మన భారతదేశంలో మహిళలు బొట్టు పెట్టుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా హిందువులు బొట్టు లేనిదే కనీసం బయట అడుగు కూడా పెట్టరు. ఆడవాళ్లకు బొట్టు పెట్టుకోవడం వల్లనే అందంగా కనిపిస్తారని పెద్దలు చెబుతుంటారు. కానీ ప్రస్తుత కాలంలో బొట్టు ఎలా పెట్టుకుంటారో కూడా తెలియని వాళ్ళు చాలా మందే ఉన్నారు.
కొంతమందికి తెలియక ఇష్టం వచ్చిన వేలుతో బొట్టు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఏ వేలితో పెడితే ఎలాంటి ఫలితం లభిస్తుందో మీరు కూడా ఒక్కసారి చూడండి. మహిళలు బొట్టును ఐదోతనానికి చిహ్నంగా పేట్టుకుంటారని పెద్దలు చెబుతుంటారు. నుదటి భాగాన్ని బ్రహ్మ స్థానంగా భావించి ఆ ప్రాంతంలో బొట్టు పెట్టుకుంటారు.
కొంతమంది ఉంగరం వేలితో బొట్టు పెట్టుకుంటారు. దానివల్ల శాంతి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా మధ్య వేలితో పెట్టుకుంటే ఆయుష్షు పెరుగుతుందని తెలుపుతున్నాయి. అంతేకాకుండా చూపుడు వేలితో బొట్టు పెట్టుకుంటే ముక్తి కలుగుతుంది. ఒకవేళ బొటన వేలితో బొట్టు పెట్టుకుంటే పుష్టి కలుగుతుందని హిందూ సాంప్రదాయం ప్రకారం పురాణాలు చెబుతున్నాయి.