చక్కర అధికంగా తింటున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..

0
111

పంచదార రుచి తీయగా ఉండడం వల్ల ఇది తినడానికి చాలామంది ఇష్టపడతారు. ఇంకొంతమందికైతే ఈ పేరు వింటే చాలు నోట్లో నీళ్ళు ఊరుతాయి. ఇంట్లో ఎక్కడవున్నా వెతికి మరి తింటుంటారు. అయితే ఇలా తినే వారికీ ఈ సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ అవి ఏ సమస్యలు ఎందుకు వస్తాయో తేలుసుకోవాలనుకుంటునారా? మరి ఇంకా ఆలస్యం ఎందుకు వెంటనే చూసేయండి..

చక్కెర గురించి మనందరికీ తెలియని విషయం ఏంటంటే..చక్కెరలో ఎలాంటి పోషకాలు లభించకపోగా..క్యాలరీల శాతం అధికంగా పెరిగి అనేక సమస్యలకు దారి తీస్తుంది. అధిక చక్కెర తీసుకోవటం వల్ల మెదడులో డోపమైన్ అధికంగా రిలీజ్ అయ్యి చక్కెరలో ఉండే ప్రక్టోజ్ కారణంగా కాలేయంపై తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది.

చక్కర అధికంగా తినడం వల్ల అధిక బరువు పెర‌గ‌డం, హార్ట్ డిసీజ్ లు రావ‌డం, యాక్నే సమస్య, టైప్ 2 డయాబెటీస్, కాన్సర్, డిప్రెషన్, చర్మం ముడతలు ప‌డ‌టం వంటి సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే ఇన్ని సమస్యలను తెచ్చే తెల్లని చక్కెరను తినటం కంటే సహజసిద్ధమైన తియ్యదనంతో కూడిన పండ్లు తినటంఆరోగ్యానికి మేలని నిపుణులు సూచిస్తున్నారు.