వేసవిలో ఈ ఆహార పదార్దాలు తీసుకుంటే నీరసానికి వెంటనే చెక్..

0
39

భానుడు ప్రతాపానికి జనాలు ఉదయం 11 దాటినా తరువాత అడుగు బయట పెట్టాలంటే జంకుతున్నారు. ఒకవేళ మనకు ఏదైనా అత్యవసర పని మీద బయటకు వెళ్లాలన్నా నీరసం వస్తుదేమోనని బయపడుతుంటాం. అందుకే ఎండల్లో బయటకు వెళ్లిన నీరసం వంటి లక్షణాల నుండి  ఉపశమనం పొందాలంటే రోజు ఈ ఆహార పదార్దాలు తీసుకోవాలి. అవేంటో మీరు కూడా చూడండి..

పుచ్చకాయ, కర్బూజ, పైనాపిల్, స్ట్రాబెరీ, మ్యాంగో వంటి వాటిలో నీటి శాతం అధికంగా ఉండడం వల్ల హైడ్రేషన్ సమస్య మన దరికి చేరకుండా ఉంటుంది. రోజు ఉదయాన్నే పాలతో పాటు..కనీసం కనీసం ఒక గుడ్డు తినడానికి ప్రయత్నించండి. దీనివల్ల వల్ల నీరసం రాకుండా రోజంతా యాక్టీవ్ గా ఉంటాము.

వేసవికాలంలో చల్లగా ఉండడానికి కూల్ డ్రింక్స్ అధికంగా తాగుతూ ఉంటారు దానివల్ల చాలా దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కావున వాటికీ బదులుగా నిమ్మ రసం, కొబ్బరి నీళ్లు, బార్లీ వంటివి తాగుతూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా వేసవిలో నట్స్, పండ్లు, పెసలు వంటివి తినడం కుడా మంచిదే.