ఫ్లాష్: విషాదం..భార్య అంటే ఇంత ప్రేమ..ఆసుపత్రి పైనుండి భర్త ఆత్మహత్య

0
61

భార్యభర్తల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకరిని విడిచి ఒకరు గడియ సేపు కూడా ఉండలేరు. అయితే తాజాగా భార్య కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆత్మహత్య చేసుకొని భార్యభర్తల బంధాన్ని మరోసారి ఈ లోకానికి చాటి చెప్పిన ఘటన తెలంగాణాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్ళితే..కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కనకల్ గ్రామానికి చెందిన సత్తవ్వ అనే మహిళ కడుపునొప్పితో బాధపడడంతో గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆమె భర్త కొమురయ్య భార్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో  భార్య కోలుకోదని కృంగిపోయి గాంధీ ఆసుపత్రిలోని   7వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలచివేసింది.

అయితే తమ కుమార్తె తండ్రి కనిపించడం లేదని వెతుకుతుండగా..ఒక్కసారిగా రక్తమడుగులో పడి ఉన్న తండ్రిని చూసి కుమార్తె రోదనకు గురయ్యింది. అనంతరం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వివరాలను చిలకలగూడ ఎస్ఐ రమేష్ మనకు వెల్లడించారు.