జగన్ ను టార్గెట్ చేసిన లోకేశ్

జగన్ ను టార్గెట్ చేసిన లోకేశ్

0
103

బంధువైనా సరే నేరస్తులని దూరంపెట్టే వ్యక్తిత్వం కోడెలదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ అన్నారు. అది తెలిసేకదా ఎన్నికల్లో మీ సహకారంతో పెదకూరపాడులో ఇండిపెండెంట్ గా నిలబెట్టారు. అప్పుడు కోడెల వారించారని ఇలా మీతోకలిసి అబద్ధప్రచారం మొదలెట్టారని లోకేశ్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు.

ఆఖరికి కోడెల శివప్రసాద్ అంతిమయాత్రని అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. అక్రమ కేసులతో మానసికంగా వేధించి వారి మృతికి కారణమయ్యారు.

ఇప్పుడు ఆయన అంతిమయాత్రను ఆపేందుకు శాంతిభద్రతల పేరుతో నర్సరావుపేట డివిజన్ మొత్తం 15 రోజులపాటు 144 సెక్షన్ అమలుచేస్తారా అంటూ లోకేశ్ వైసీపీని ప్రశ్నించారు