ఈ సృష్టిలో అందంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. ముఖ్యంగా మహిళలు తమ అందాన్ని మెరుగుపరచుకోవడం కోసం అనేక చిట్కాలను పాటిస్తూ ఉండడంతో పాటు..మార్కెట్లో దొరికే వివిధ రకాల కెమికల్స్ తో తయారు చేసిన అంటిమెంట్స్ ను కూడా ఉపయోగిస్తారు. కానీ వాటిని వాడడం వల్ల శరీరంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
అందుకే మనందరి ఇళ్లల్లో సాధారణంగా దొరికే పెరుగుతో కేవలం ఆరోగ్యపరనగానే కాకుండా..అందాన్నిపెంచుకోవడంలో కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. పెరుగుతో ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకుని వాడడం వల్ల చర్మ సంబంధమైన సమస్యలు తగ్గడంతో పాటు..చర్మాన్ని కాంతివంతంగా తయారుచేయడంలో కూడా ఉపయోగపడుతుంది.
మొదటి చిట్కా: ఒక కప్పు పెరుగులో శనగ పిండి, కొద్దిగా పసుపును వేసి కలిపి ఫేస్ ప్యాక్ లా వేసుకుని 20 నిమిషాల తరువాత కడగడం వల్ల పొడిబారకుండా చేయడంతో పాటు ముఖాన్ని కాంతివంతంగా తయారుచేస్తుంది.
రెండవ చిట్కా: పెరుగులో బియ్యం పిండిని కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్ లా వేసుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా రోజు చేయడం వల్ల నలుపు తగ్గడంతో పాటు..చర్మంపై ముడతలు కూడా క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయి.