తెలంగాణాలో ఉద్యోగాల జాతర మొదలయిపోయింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు చక్కని అవకాశాలు కల్పిస్తుంది. తెలంగాణాలో ఇప్పటికే పోలీస్ , గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తుంది.
తాజాగా కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ శాఖలో మరో 1201 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో వెయ్యి జూనియర్ లైన్ మెన్ పోస్టులు కాగా 201 సబ్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. వివిధ జిల్లాల్లో పోస్టులు ఉన్నట్టు ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ను విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.