వైసీపీలో చేరేందుకు వచ్చిన నారాయణకు బ్రేక్ వేసింది ఎవరు ?

వైసీపీలో చేరేందుకు వచ్చిన నారాయణకు బ్రేక్ వేసింది ఎవరు ?

0
97

ర్యాంకుల రారాజు మాజీ టీడీపీ మంత్రి నారాయణ రాజకీయ పరిస్థితి గందరగోళంగా మరిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ మేధావులు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత నెల్లూరు జిల్లాలో ఆ స్థాయి రాజకీయాలను చేశారు నారాయణ.

కానీ అధికారం ఎవ్వరికి శాశ్వితం కాదు అందుకే ఇప్పుడు నారాయణ మదనపడుతున్నారట. ఎన్నికల సమయంలో నారాయణ వేసిన ఎత్తుగడలంటు లేవు గతంలో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడిన మాటను కట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. గెలుపే లక్ష్యంగా చేసుకుని విచ్చలవిడిగా డబ్బులు చల్లారు కానీ ప్రజలు మాత్రం నారాయణను విశ్వసించలేదు.

అనిల్ కుమార్ యాదవ్ కే మరోసారి పట్టం కట్టారు.. ప్రస్తుతం ఆయన ఓటమి అనేక ఇబ్బందులకు గురి చేస్తోందట. ఇప్పటికే పలువు టీడీపీ నేతలమీద కేసులు బుక్ అయ్యాయి. నెక్స్ట్ నారాయణ అని బలంగా వినిపిస్తున్న తరుణంలో తన వ్యాపార సంస్థను కాపాడుకునేందుకు వైసీపీలో చేరాలని చూస్తున్నారట. కానీ కుదరదు అని తేల్చి చెబుతోందట వైసీపీ… వైసీపీలోకి నారాయణను చేర్చుకుంటే ప్రజలకు తప్పుడు సంకేతాలను పంపినట్లు అవుతుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పినట్లు సమాచారం.