చదువుపై ఉన్న పట్టుదలతో స్ట్రెచర్​పై పడుకునే పరీక్ష రాసిన విద్యార్థి..

0
101

తమిళనాడులోని తిరునెల్వేలిలో ఓ యువకుడి పట్టుదలకు అందరు షాక్ అయ్యారు. అతని పట్టుదలకు, విశ్వాసానికి ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. వివరాల్లోకి వెళితే..ఇంటర్ చదువుతున్న అజారుద్దీన్ అనే యువకుడు ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు.

దాంతో అజారుద్దీన్ ను పరీక్షించిన వైద్యులు శస్త్రచికిత్స చేసి కాలుకు కట్టు కట్టి కొంతకాలం విశ్రాంతి తీసుకోమని సూచించారు. కానీ అతనికి చదువుపై ఉన్న శ్రద్ధతో కాలుకు తీవ్రమైన నొప్పి ఉన్న భరించి అంబులెన్సు సహాయంతో పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు. అనంతరం ఉపాధ్యాయుల అనుమతితో తీవ్రమైన నొప్పిని కూడా భరించి స్ట్రెచర్పై పడుకునే పరీక్ష రాసి అందరి చేత అభినందనలు పొందాడు.